జేడీ లక్ష్మీనారాయణపై ఆగని విజయసాయి రెడ్డి సెటైర్లు..!

జేడీ లక్ష్మీనారాయణపై ఆగని విజయసాయి రెడ్డి సెటైర్లు..!

జేడీ లక్ష్మీనారాయణపై ఆగని విజయసాయి రెడ్డి సెటైర్లు..!
 
గతంలో వైసీపీ పార్టీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన జేడీ లక్ష్మీనారాయణ నీ టార్గెట్ చేస్తూ వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు విజయ్ సాయి రెడ్డి గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు . గతంలో తమను వేధించిన తీరు గుర్తుకు వచ్చిందో ఏమో కాని ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు విజయసాయిరెడ్డి. లక్ష్మీనారాయణ ఎపి ముఖ్యమంత్రి, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగే వ్యక్తి అని విజయసాయి ద్వజమెత్తారు. అలాంటి వ్యక్తికి తమ పార్టీలో స్థానం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే జేడీ గారికి మా పార్టీలో ఎన్నటికీ స్థానం లేదు. ఉండదు కూడా. బహుశా ఆయనే చేరాలనుకున్నారేమో. కోవర్టు ఆపరేషన్ల కోసం వచ్చే ఆలోచన చేశారని ఇప్పడు అనిపిస్తుంది. సీబీఐ లాంటి సంస్థను బాబుకు పాదాక్రాంతం చేసిన వ్యక్తి దేశాన్ని మార్చే కలలు కంటున్నాననడం పెద్ద జోక్. అని ట్వీట్‌ చేశారు.Top