నన్ను జైలుకు పంపే ప్రోగ్రాం మోడీ పెట్టాడు అని ఆరోపిస్తున్న చంద్రబాబు…!

Written By Aravind Peesapati | Updated: April 23, 2019 10:57 IST
నన్ను జైలుకు పంపే ప్రోగ్రాం మోడీ పెట్టాడు అని ఆరోపిస్తున్న చంద్రబాబు…!

నన్ను జైలుకు పంపే ప్రోగ్రాం మోడీ పెట్టాడు అని ఆరోపిస్తున్న చంద్రబాబు…!
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ సర్జికల్ స్ట్రైక్ గురించి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో మరియు నేషనల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. దేశ భద్రతకు సంబంధించిన శత్రు దేశాల తో చేసిన పోరాటాలు మరియు దాడుల విషయమై ఎన్నికల ప్రచారంలో మోడీ వాడు కొనడాన్ని దేశ జవాన్లు దేశ అన్ని కాపాడటం కోసం చేసిన పోరాటాన్ని బిజెపి పార్టీకి అనుకూలంగా మోడీ చేస్తున్న ఎన్నికల ప్రచారాన్ని చాలామంది మేధావులు తప్పు పడుతున్నారు. ఇదిలావుండగా తాజాగా జాతీయస్థాయిలో మోడీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోడీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్ కు సంబంధించి ఆధారాలు ఉన్నాయా అని మోడీ కి ప్రశ్నల వర్షం కురిపించారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ...సర్జికల్‌ స్ట్రైక్స్‌ పేరుతో నరేంద్ర మోదీ నాటకాలాడుతున్నారని, 350 మంది పాకిస్తాన్‌ ఉగ్రవాదులను చంపేశామన్నారు. ఎక్కడా మీడియాలో ఈ దృశ్యాలు చూపించలేదు, మీతో ఏమైనా ఆధారాలు ఉంటే చూపెట్టమని ఈ సభాముఖంగా బీజేపీ నాయకులకు సవాల్‌ విసురుతున్నా అన్నారు. తనను కూడా త్వరలోనే జైల్లో పెట్టాలని పన్నాగాలు పన్నుతున్నారు అని కూడా ఆరోపించారట.
Top