బిజెపి పార్టీ పై కొత్త సంచలన ఆరోపణలు చేస్తున్న మమతా బెనర్జీ..!

By Xappie Desk, April 24, 2019 10:56 IST

బిజెపి పార్టీ పై కొత్త సంచలన ఆరోపణలు చేస్తున్న మమతా బెనర్జీ..!

బిజెపి పార్టీ పై కొత్త సంచలన ఆరోపణలు చేస్తున్న మమతా బెనర్జీ..!
 
దేశం మొత్తం ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపి పార్టీ పై చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యాయి. ఎప్పటినుండో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీకి తలనొప్పిగా మారుతూ జాతీయస్థాయిలో కూటమిని ఏర్పాటు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న మమతా బెనర్జీ అదే స్థాయిలో తాజాగా దేశం మొత్తం లో జరుగుతున్న ఎన్నికల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై చిత్ర విచిత్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న చోటా పహారా కాస్తున్న కేంద్ర బలగాలు పోలింగ్ బూత్ దగ్గరికి వస్తున్న ఓటర్లను బిజెపికి ఓటు వేయాలని కోరుతున్నాయని ఆమె ఆరోపించారని వార్త వచ్చింది.
 
మల్ధాహదక్షిణ్‌, బలూర్‌ఘాట్‌ నియోజకవర్గాల్లోని ఓటర్లను కేంద్ర బలగాలు ఇలా కోరాయని ఆమె అంటున్నారు. . దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈసీకి సమాచారం అందచేసిందని మమతా బెనర్జీ చెప్పారు. వారికి అలా చెప్పే హక్కు లేదని, దీనిపై తమ అభ్యంతరాలను ఈసీకి నివేదించామని వెల్లడించారు. పోలింగ్‌ కేంద్రాల్లో కేంద్ర బలగాలకు పనేముందని ఆమె ప్రశ్నించారు.


Tags :


Top