జేసీ దివాకర్ రెడ్డి కి అదిరిపోయే కౌంటర్లు వేసిన విజయసాయిరెడ్డి..!

Written By Aravind Peesapati | Updated: April 24, 2019 11:04 IST
జేసీ దివాకర్ రెడ్డి కి అదిరిపోయే కౌంటర్లు వేసిన విజయసాయిరెడ్డి..!

జేసీ దివాకర్ రెడ్డి కి అదిరిపోయే కౌంటర్లు వేసిన విజయసాయిరెడ్డి...!
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టమంటే మీడియా ముందే సంచలన వ్యాఖ్యలు చేసిన అనంతపురం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డికి దిమ్మతిరిగిపోయే విధంగా కౌంటర్లు వేశారు విజయసాయిరెడ్డి. అసలు దేశంలో ఓటర్లను ప్రలోభపెట్టడం కార్యక్రమం మొదలు పెట్టింది టిడిపి అధినేత చంద్రబాబే అని విజయ్ సాయి రెడ్డి విమర్శించారు.
 
వ్యవస్థలను మరియు న్యాయస్థానాలను మేనేజ్ చేసే చంద్రబాబు అధికారం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేందుకు వెనుకాడరని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ‘ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం దేశంలో మొదలు పెట్టిందే చంద్రబాబు.. దివాకర్ రెడ్డి గారూ. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తరువాత 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రూ. 500 నోట్లు వెదజల్లిన చరిత్ర చంద్రబాబుది. ప్రస్తుత ఎన్నికల్లో మీ పార్టీ పెట్టిన ఖర్చు రూ. 20 వేల కోట్ల పైనే. అయినా ప్రజలు టీడీపీకి కర్రు కాల్చి వాత పెట్టార’ని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
Top