జగన్ ధీమాకు కారణం అదే…!

Written By Xappie Desk | Updated: April 24, 2019 11:06 IST
జగన్ ధీమాకు కారణం అదే…!

జగన్ ధీమాకు కారణం అదే…!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ కచ్చితంగా గెలవడం ఖాయం అని తానే ముఖ్యమంత్రినని పక్కా కాన్ఫిడెంట్తో ఉన్నారు వైసీపీ అధినేత జగన్. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల తర్వాత వైసిపి పార్టీ మినహా మిగతా పార్టీలు అన్నీ ఎలక్షన్ కమిషన్ పై మరియు ఈవీఎంలపై చిత్ర విచిత్ర ఆరోపణలు చేస్తూ మీడియా ముందు ప్రజలను గందరగోళం చేసే విధంగా కామెంట్ చేస్తుంటే ఒక్క వైసీపీ పార్టీ మాత్రం ఈ సారి విజయం తమదేనని చాలా ధీమాగా ఉన్నారు.
 
అయితే ఇంత ధీమాకీ వైసీపీ అధినేత జగన్ ఉండటానికి గల కారణం ఇటీవల బయటపడింది. ఎన్నికలు జరిగిన తర్వాత మరియు ఎన్నికలు జరగక ముందు దాదాపు పలు ప్రముఖ సంస్థలతో సర్వే చేయించారట జగన్. మొత్తం ఆరు విభిన్న సంస్థల ద్వారా జగన్ సర్వేలు చేయించుకున్నారని.. అవన్నీ జగన్‌కు పాజిటివ్ సంకేతాలు ఇచ్చాయని, అలాగు ప్రీ పోల్ – ఎగ్జిట్ పోల్ సర్వేలను జగన్ తీసుకున్నారని.. అన్నీ కూడా వైసీపీకి వంద సీట్లకు తగ్గే అవకాశం లేదని ఆ స‌ర్వేల‌న్నీ తేల్చిచెప్ప‌డంతో జగన్ విజయం పట్ల ధీమాతో ఉన్నారని, వైసీపీ శ్రేణులు అంటున్నారు.
Top