జగన్ కోడి కత్తి కేసు లో నిందితుడు శ్రీనివాస్ కి అస్వస్థత..!

Written By Aravind Peesapati | Updated: April 24, 2019 11:08 IST
జగన్ కోడి కత్తి కేసు లో నిందితుడు శ్రీనివాస్ కి అస్వస్థత..!

జగన్ కోడి కత్తి కేసు లో నిందితుడు శ్రీనివాస్ కి అస్వస్థత..!
 
గత సంవత్సరం అక్టోబరు మాసంలో 25 వ తారీఖున పాదయాత్రలో ఉన్న జగన్ కోర్టుకు వెళ్లేందుకు విశాఖపట్నం విమానాశ్రయం లో విశ్రాంతి తీసుకునే విఐపి లాంజ్ లో కూర్చున్న క్రమంలో ఎయిర్పోర్టులో క్యాంటీన్ లో పనిచేసే నిందితుడు శ్రీనివాస్ కోడి కత్తితో జగన్ పై దాడి చేయడం జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన జగన్ ఆ దాడి నుండి తప్పించుకొని కొద్దిపాటి గాయంతో హాస్పిటల్ పాలయ్యారు.
 
అప్పట్లో జగన్ పై జరిగిన ఈ దాడి రెండు తెలుగు రాష్ట్రాల ను కుదిపేసింది. ముఖ్యంగా ఏపీ లో ఉన్న అధికార పార్టీ టీడీపీ కావాలని జగన్ పై తానే దాడి చేయించుకున్నారని ఇలా రకరకాల ఆరోపణలు చేసింది. ఇదిలావుండగా తాజాగా నిందితుడు శ్రీనివాస్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్న క్రమంలో ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైనట్లు చాతిలో తీవ్ర నొప్పి రావడంతో నిందితుడు శ్రీనివాసుని రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది వెంటనే జిల్లా ఆస్పత్రిలో ప్రిజనర్స్ వార్డులో చికిత్స చేయిస్తున్నారు. అయితే శ్రీనివాస్ ఆరోగ్యం గురించి పోలీసులు గాని అటు వైద్యులు గాని ఎలాంటి సమాచారాన్ని ఇవ్వటం లేదు.
Top