టిడిపి పార్టీ కి షాక్ ఇచ్చిన సి.బి.ఐ..!

Written By Janani K | Updated: April 26, 2019 10:18 IST
టిడిపి పార్టీ కి షాక్ ఇచ్చిన సి.బి.ఐ..!

టిడిపి పార్టీ కి షాక్ ఇచ్చిన సి.బి.ఐ..!
 
గత నాలుగు సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి మద్దతుగా ఉన్న తెలుగుదేశం పార్టీ సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు ఇంకా ఏడాది ఉండగా అటువంటి సమయంలో బిజెపి పార్టీ పై సంచలన ఆరోపణలు చేస్తూ ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ సరికొత్త రాజకీయానికి తెర లేపింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్ల ప్రత్యేక ప్యాకేజీ వల్ల చాలా లాభాలు ఉన్నాయని మీడియా ముందే తెలిపిన చంద్రబాబు ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా బిజెపి పార్టీ మోసం చేసిందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజల రావలసిన హక్కులను పార్లమెంటు సాక్షిగా కాల రాసిందని చెబుతూ కేంద్ర క్యాబినెట్ లో ఉన్న తన ఎంపీల చేత టిడిపి అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టింది ఈ విషయం మనకందరికీ తెలిసినదే.
 
ఇదిలా ఉండగా తాజాగా కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజ‌నా చౌద‌రికి సీబీఐ కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని రుణాలను ఎగ్గొట్టిన మోసం చేసిన కేసులో ప్రశ్నించే నిమిత్తం సుజనాను సీబీఐ పిలిచినట్టు తెలుస్తోంది. 2017లో ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేర మోసం చేసిన కేసు నిమిత్తం సీబీఐ బెంగళూరు బ్రాంచ్ ఆయనకు సమన్లు జారీ చేసినట్టు సమాచారం. ఇప్ప‌టికే ఈ కేసుకు సంబంధించి సుజనా చౌదరికి చెందిన రూ. రూ.315 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. తాజాగా సిబిఐ తీసుకున్న నిర్ణయంతో తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చినట్లయింది.
Top