జగన్ ముఖ్యమంత్రి అంటూ చీఫ్ సెక్రటరీ ఎల్ వి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు..!

జగన్ ముఖ్యమంత్రి అంటూ చీఫ్ సెక్రటరీ ఎల్ వి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు..!

జగన్ ముఖ్యమంత్రి అంటూ చీఫ్ సెక్రటరీ ఎల్ వి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కచ్చితంగా వైసీపీ పార్టీ గెలవడం ఖాయం అని జగన్ ముఖ్యమంత్రి అని ఎన్నికల తర్వాత జరిగిన అన్ని సర్వేల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ తాను జూన్ 8 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అప్పటివరకు ఎవరు మాట్లాడే ప్రసక్తి లేదని కామెంట్లు చేస్తున్న క్రమంలో బాబు చేసిన కామెంట్లకు ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం చెక్ పెట్టారు.
 
మే 23న వచ్చిన ఫలితాల్లో టీడీపీ ప్రభుత్వం మరోసారి ఎన్నిక కాకపోతే ఆయన వెంటనే దిగిపోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రేనని, అయితే, ఆయనకు ఎలాంటి అధికారాలు ఉండవని తేల్చి చెప్పారు. స‌మీక్ష‌లు నిర్వ‌హించే అధికారంకూడా బాబుకు లేద‌ని తేల్చిచెప్పారు. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి, రాజ్యాంగం ప్ర‌కారం మే 23న ఎన్నిక‌ల కౌంటింగ్ అనంత‌రం ఫ‌లితాలు వైసీపీ అనుకూలంగా వ‌స్తే వైఎస్ జ‌గ‌న్ ఆ మ‌రుస‌టి రోజే అంటే మే 24వ తేదీ నాడే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని, ఒక‌వేళ టీడీపీకి అనుకూల ఫ‌లితాలు వెలువ‌డితే చంద్ర‌బాబు త‌న‌కు ఇష్ట‌మొచ్చిన రోజు ప్ర‌మాణ స్వీకారం చేసుకోవ‌చ్చ‌ని సీఎస్ క్లారిటీ ఇచ్చారు.Top