విజయ్ సాయి రెడ్డే నాకు ఫోన్ చేశాడు: జేడీ లక్ష్మీనారాయణ..!

Written By Janani K | Updated: April 26, 2019 10:25 IST
విజయ్ సాయి రెడ్డే నాకు ఫోన్ చేశాడు: జేడీ లక్ష్మీనారాయణ..!

విజయ్ సాయి రెడ్డే నాకు ఫోన్ చేశాడు: జేడీ లక్ష్మీనారాయణ..!
 
ప్రస్తుతం సోషల్ మీడియా సాక్షిగా వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి మరియు జనసేన పార్టీ నాయకుడు జేడీ లక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా లక్ష్మీనారాయణ విజయసాయి రెడ్డి పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను మహారాష్ట్రలో చేపట్టిన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఏపీ రాజకీయాల్లో రాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నుండి తనకు ఆహ్వానాలు వచ్చినట్లు ఇందులో భాగంగా వైసీపీ పార్టీ నుండి కూడా తనకు ఆహ్వానం వచ్చిందని పేర్కొన్నారు జేడీ లక్ష్మీనారాయణ.
 
అయితే ఈ విషయంలో వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి తనకు స్వయంగా ఫోన్ చేసి పార్టీలోకి రమ్మని ఆహ్వానించినట్లు తెలిపారు. ముఖ్యంగా వైసీపీ పార్టీ అధినేత జగన్ ని వృత్తిపరంగా మీరు అరెస్టు చేసినట్లు అని విజయసాయి రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు వేరు వృత్తి వేరు అని అన్నారని జె డి పేర్కొన్నారు. అంతేకాకుండా మేం కూడా ప్రజల కోసం మంచి పనులు చేయాలనుకుంటున్నాం. తాము కూడా అన్ని పార్టీల్లానే ప్రజల కోసం కష్టపడుతున్నాము… జగన్ కూడా ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసాడు అందుకని తాను కూడా వారి పార్టీలో చేరాల్సిందిగా కోరారని జేడీ లక్ష్మీ నారాయణ వెల్ల‌డించారు.
Top