జగన్ ఫేక్ ట్విట్టర్ అకౌంట్ తో తప్పుడు ప్రచారం..!

Written By Janani K | Updated: April 26, 2019 10:29 IST
జగన్ ఫేక్ ట్విట్టర్ అకౌంట్ తో తప్పుడు ప్రచారం..!

జగన్ ఫేక్ ట్విట్టర్ అకౌంట్ తో తప్పుడు ప్రచారం..!
 
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల విషయంలో అవకతవకలు జరిగిన క్రమంలో ...ఈ విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో వైసీపీ పార్టీ అధినేత జగన్ ట్విట్టర్ ఫేక్ ఎకౌంట్ రాజకీయ ప్రత్యర్థులు క్రియేట్ చేసి ఒక తప్పుడు ట్వీట్ను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.
 
తాజాగా ట్విట్టర్లో ఇంటర్ ఫలితాల తీరుపై తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంలో సీఎం కె. చంద్రశేఖర్‌రావును నిందించరాదని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నట్లు ఆయన పేరుతో తప్పుడు ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ అయిందని ఆ పార్టీ తెలిపింది.దీనిపై ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అది పూర్తిగా తప్పుడు ట్వీట్‌ అని, ఈ ట్వీట్‌ను దురుద్దేశంతో రూపొందించి, ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
Top