వైసిపి పార్టీ నేతల పై ఫైర్ అయిన దేవినేని ఉమా..!

Written By Janani K | Updated: April 26, 2019 10:32 IST
వైసిపి పార్టీ నేతల పై ఫైర్ అయిన దేవినేని ఉమా..!

వైసిపి పార్టీ నేతల పై ఫైర్ అయిన దేవినేని ఉమా..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెగ బెట్టింగులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా వైసీపీ నేతలు చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా అతిగా ప్రవర్తిస్తున్నారని ఊహల ప్రపంచంలో ఉన్నారని...గత ఎన్నికల్లో కూడా ఇలాగే జరిగిందని కానీ చివరాకరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించారని పేర్కొన్నారు.
 
ముఖ్యంగా వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి చాలా అతిగా ప్రవర్తిస్తున్నారని దూకుడుగా వ్యవహరిస్తున్నారని భాష కూడా దుర్మార్గంగా ఉందని పేర్కొన్నారు. వైసీపీ నేతలు బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. పసుపుకుంకుమ డబ్బులు మహిళలకు అందకుండా కుట్రలు జరిగాయన్నారు. వృద్ధులకు పింఛన్లు అందకుండా కూడా కుట్రలు చేశారన్నారు. విజయసాయిరెడ్డి కుటుంబరావుపై వ్యక్తిగత దాడులకు దిగడం హేయమన్నారు. బంగారం విషయంలోనూ దుర్గార్గంగా మాట్లాడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. లోటస్ పాండ్ లో కులుకుతున్న జగన్ కేసీఆర్ తో చేతులు కలిపి, వెయ్యి కోట్లకు కక్కుర్తి పడి ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇలాంటి విషయాలలో జగన్ నోరు తెరవాలని పోలవరంపై నేషనల్ ట్రిబ్యునల్ లో కేసులు ఎందుకు వేశారని ప్రశ్నించారు.
Top