జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం అప్పుడే ఫిక్స్ చేసేశారు..?

Written By Xappie Desk | Updated: April 27, 2019 09:51 IST
జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం అప్పుడే ఫిక్స్ చేసేశారు..?

జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం అప్పుడే ఫిక్స్ చేసేశారు..?
 
మే 23 వ తేదీ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల అయిన తర్వాత మేమంటే మేము అంటూ మీడియా ముందు అధికారంలోకి వస్తామని అధికార పార్టీ టీడీపీ మరియు ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ నేతలు తెగ కామెంట్లు చేస్తున్న క్రమంలో మరో పక్క టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు జూన్ 8 వ తారీకు వరకు నేనే ముఖ్యమంత్రి అని ఎవరు గెలిచినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు.
 
ఈ క్రమంలో మరో పక్క వైసిపి పార్టీకి చెందిన నాయకులు జగన్ ప్రమాణస్వీకారం తేదీని ప్రకటిస్తున్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద బాబు పెత్తనం పోయింది. ఇది తెలిసే జూన్ 8 వరకూ నేనే సీఎం అంటున్నారు. ఇదేనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ. మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. మే 26న ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి చంద్రబాబు జూన్ 8 దాకా ఎలా సీఎంగా ఉంటారు’ అని ప్రశ్నించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ విజయం పై విశ్వాసం తో ఉన్న పార్టీ నేతలు ప్రమాణ స్వీకార ముహూర్తం కూడా నిర్ణయించారు. మే 23 వ తారీకు విశేషం ఏమిటంటే ఆరోజు వైసీపీ పార్టీ అధినేత జగన్ తాతగారు వైయస్ రాజారెడ్డి మరణించిన రోజు..ఈ నేపథ్యంలో కడప జిల్లాలో ఉన్న రాజకీయ నేతలు తన తాత మరణించిన రోజును వైయస్ జగన్ అధికారంలోకి వెళ్లటం నిజంగా విశేషమని అంటున్నారు.
Top