దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలంటూ రాహుల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్..!

Advertisement

by Aravind Peesapati | April 27, 2019 09:55 IST
Follow Xappie
దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలంటూ రాహుల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్..!

దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలంటూ రాహుల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్..!
 
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో తిరిగి ఎన్డీఏ కూటమి రాకుండా జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్. అంతేకాకుండా ప్రస్తుతం దేశ స్థాయిలో జరుగుతున్న ఎన్నికల్లో మళ్లీ ప్రదాని మోడీ, అమిత్ షాలు తిరిగి అదికారంలోకి వస్తే అందుకు పూర్తి భాద్యత రాహుల్ గాందీ దే అవుతుందని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఏ కూటమిని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారో రాహుల్ చెప్పాలని ఆయన అన్నారు.
 
డిల్లీలో పొత్తు కోసం ప్రయత్నాలు విఫలం అయ్యాయని ఆయన అన్నారు. ‘మోదీ-షా ద్వయం అధికారంలోకి కాకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. దానికోసం ప్రభుత్వం ఏర్పాటు చేసే ఏ కూటమికైనా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 2019 ఎన్నికలు దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షిస్తాయి. కాబట్టి జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు సరైన నిర్ణయాలు తీసుకోవాలని కేజ్రీవాల్ సూచించారు. మనం ముందు భారతీయులం. తర్వాతే హిందూ, ముస్లిం అనే తేడా. ప్రస్తుతం మన దేశ ఐక్యత ప్రమాదంలో పడింది. కులం, మతం పేరిట మనం విడిపోకుండా ఉంటేనే ఈ దేశానికి రక్షణ దొరుకుతుంది’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.


Advertisement


Advertisement

Top