మళ్ళీ నాలుక కరుచుకున్న నారా లోకేష్.., అదిరిపోయే సెటైర్ వేసిన విజయసాయిరెడ్డి.!

Written By Xappie Desk | Updated: April 27, 2019 09:58 IST
మళ్ళీ నాలుక కరుచుకున్న నారా లోకేష్.., అదిరిపోయే సెటైర్ వేసిన విజయసాయిరెడ్డి.!

మళ్ళీ నాలుక కరుచుకున్న నారా లోకేష్.., అదిరిపోయే సెటైర్ వేసిన విజయసాయిరెడ్డి.!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో సార్వత్రిక ఎన్నికల్లో ఒక పక్క సీరియస్ గా ఎన్నికల జరుగుతూ ఉంటే మరోపక్క నారా లోకేష్ చేసిన ప్రసంగాలు మరియు డైలాగులు సోషల్ మీడియాలో పెద్ద హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నారా లోకేష్ ఏదో ఒక సమయాన ప్రసంగిస్తున్న క్రమంలోనే నాలుక జారుతూ అనుకోకుండా పెద్ద కామెడీ పండించే వారు.
 
దీంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అయ్యాయి. ఇదిలావుండగా తాజాగా నారా లోకేష్ పై ట్విట్టర్ సాక్షిగా విజయసాయిరెడ్డి సంచలన సెటైర్లు వేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే విజయసాయిరెడ్డి ఇటీవల ఒక ట్వీట్ చేస్తూ ‘పప్పు మళ్లీ ఇరుక్కున్నాడు. దేశంలో 900 లోక్ సభ స్థానాలున్నాయంట. మంగళగిరిలో 5 లక్షల మెజారిటీతో గెలిపించాలని కోరినట్లే ఉంది. తండ్రేమో రష్యన్ హ్యాకర్లు ఈవీఎంల ఫలితాలను మారుస్తారని గోల చేస్తున్నారు. ఇద్దరూ రాష్ట్రం పరువు మంట గలుపుతున్నారు. పప్పు, తుప్పులను గొలుసులతో కట్టేయాలేమో?’ అని ఎద్దేవ చేశారు. భారతదేశంలో 900 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేస్తున్నారంటూ నారా లోకేష్‌ మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.
Top