బాబు చేతిలో టీడీపీ నుండి వైసీపీ కి వెళ్తున్న క్యాండిడేట్ ల లిస్టు..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల లో కచ్చితంగా వైసీపీ పార్టీ గెలుస్తుందని పలువురు ప్రముఖ సంస్థ సర్వే లు చెబుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఫలితాలు వచ్చిన వెంటనే వైసిపి పార్టీ లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు కొంతమంది పేర్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్నాయి. దీంతో ఈ మ్యాటర్ చంద్రబాబు దగ్గరికి వెళ్లడం తో వెంటనే అప్రమత్తం అయ్యారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల పై నిఘా కూడా పెట్టినట్లు సమచారం. ఈ విషయాన్ని టీడీపీ నేతలతో ఏర్పాటు చేసిన ఇన్నర్ మీటింగ్‌లో స్వయంగా చంద్రబాబే తెలియజేశారట. టీడీపీ నుండి జంప్ చేసే నేతల లిస్ట్ తన దగ్గర ఉందని, అలా చేయడం కరెక్ట్ కాదని కూడా హితబోధ చేశారట చంద్రబాబు. అయితే చంద్రబాబు హితబోధ చేసినా, నిఘా పెట్టినా.. వారంతా జంప్ చేయాలనుకుంటే ఎవరు ఆపగలరు.. ఏది ఏమైనా నిజంగానే ఎన్నికల ఫలితాల తర్వాత వారంతా వైసీపీలోకి జంప్ అయితే చంద్రబాబు నెత్తి మీద గుడ్డ వెసుకోవాల్సిందే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.