చంద్రబాబు సన్నిహితులు చేసిన సర్వేలో కూడా డీలా పడ్డ టీడీపీ...?
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఎవరు అన్నదానిపై ఇక చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా ఓటింగ్ శాతం పెరగడం మరియు అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగటంతో రాష్ట్రంలో ఓటర్ నాడీ అంచనా వేయలేకపోతున్నారు ప్రధాన పార్టీల నేతలు. ఇదిలావుండగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కొమ్ముకాసే సన్నిహితంగా ఉండే ఒక మీడియా ఛానల్ యాజమాన్యం నిష్పక్షపాతంగా అసలు ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓటర్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపాడు అన్న దానిపై సర్వే చేయించగా..చంద్రబాబు కి దిమ్మ తిరిగిపోయే విధంగా రిజల్ట్ వచ్చినట్లు టాక్ వినపడుతోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం లో పనిచేసిన అధికారులు మరియు పోలీసులకు ముందే ఎన్నికలు జరిగిన నేపథ్యంలో తాజాగా ఈ మీడియా ఛానల్ చేపట్టిన సర్వేలో అధికార యంత్రాంగం మొత్తం వైసీపీ పార్టీకి ఓటు వేసినట్లు ఫలితాలు వచ్చినట్లు సమాచారం. మామూలుగా అయితే పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తారు. ఎన్నికలకు ముందు ఏపీ పోలీసులు ఎలా పని చేశారో అందరం చూశాము. అయితే కరెక్ట్‌గా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఆంధ్రా పోలీసులు వైసీపీ టర్న్ తీసుకున్నారని సమాచారం. పోలింగ్ రోజు కూడా పోలీసులు వైసీపీకే సహకరించారని టీడీపీ అనుకూల మీడియానే వార్తలు ప్రచారం చేసింది. ఒకవైపు చంద్రబాబు ఏమో ఈవీయంలు ట్యాంపరింగ్ చేశారని, వాపోతున్నారు.. మరోవైపు టీడీపీ అనుకూల మీడియా ఏమో టీడీపీకి పోలీసులు సహకరించలేదంటూ వాపోతుంది. దీంతో టీడీపీ ఓటమి ఖాయమని టీడీపీ అనుకూల మీడియా కూడా కన్ఫర్మ్ చేసిందని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.