జగన్ కి ముక్కుసూటిగా షాకింగ్ ప్రశ్నవేసిన విజయశాంతి..!

Written By Aravind Peesapati | Updated: April 28, 2019 15:07 IST
జగన్ కి ముక్కుసూటిగా షాకింగ్ ప్రశ్నవేసిన విజయశాంతి..!

జగన్ కి ముక్కుసూటిగా షాకింగ్ ప్రశ్నవేసిన విజయశాంతి..!
 
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి వైసీపీ పార్టీ అధినేత జగన్ కి ఒక సూటి ప్రశ్న వేశారు. జాతీయ రాజకీయాల్లో కీలక నవ్వాలని కేసిఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు జగన్ ని కలవడం మనందరం చేశాం. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున గెలిచిన నాయకులను చంద్రబాబు తన పార్టీలోకి తీసుకున్న విషయంలో గగ్గోలు పెట్టిన జగన్ జాతీయ రాజకీయాల్లో కేసీఆర్కి మద్దతు అంటూ వస్తున్న కామెంట్ల విషయంలో ...ప్రస్తుతం తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను ఫిరాయింపు చేస్తున్న కెసిఆర్ కి జగన్ ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారో తెలపాలని ఇది ఎంతవరకు...స‌మంజ‌సం అని విజ‌య‌శాంతి జ‌గ‌న్‌ను సూటిగా ప్ర‌శ్నించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌ప్పైన ఫిరాయింపులు, తెలంగాణ‌లో ఎలా ఒప్పుకుంటార‌ని విజ‌య‌శాంతి ప్ర‌శ్నించారు. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభ‌పెట్ట‌డం జ‌గ‌న్ దృష్టిలో త‌ప్పా.. ఓప్పా అనేది చెప్పాల‌ని విజ‌య‌శాంతి ప్ర‌శ్నించారు. మరి విజయశాంతి వేసిన ప్రశ్నలకు జగన్ ఏ విధమైన స్పందన ఇస్తారో చూడాలి.
Top