ఎయిర్ ఇండియా పై ఫైర్ అయిన ప్రయాణికులు..!

Written By Aravind Peesapati | Updated: April 28, 2019 15:30 IST
ఎయిర్ ఇండియా పై ఫైర్ అయిన ప్రయాణికులు..!

ఎయిర్ ఇండియా పై ఫైర్ అయిన ప్రయాణికులు..!
 
ఇటీవల సాంకేతికంగా ఎయిర్ ఇండియా కు సంబంధించిన సర్వర్ లో సమస్యలు తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా ఎయిరిండియా సర్వీసులు కార్యకలాపాలు మొత్తం నిలిచిపోయినట్లు సమాచారం వచ్చింది. దీంతో చాలామంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం తెల్లవారుజాము నుంచే ఈ సమస్య చోటుచేసుకోవడంతో.. వేలాది మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టులలో నిలిచిపోయారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు.. తాము ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు.సీటా-డీసీఎస్‌ సిస్టమ్స్‌ బ్రేక్‌ డౌన్‌ కావడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఎయిర్‌ ఇండియా తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది.వీళ్ల విచారం ఎవరికి కావాలి. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయాలి కాని. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో చాలా మంది నెటిజన్లు ఎయిర్ ఇండియా సేవలపై మండిపడుతున్నారు.
Top