నిరవధిక దీక్షకు దిగిన బీజేపీ..!

నిరవధిక దీక్షకు దిగిన బీజేపీ..!

నిరవధిక దీక్షకు దిగిన బీజేపీ..!
 
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఫలితాల అవకతవకల విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఇదే అదను చూసుకుని పోటాపోటీగా నిరవధిక దీక్షకు దిగుతున్నాయి.
 
కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలోని మహాకూటమి ఇంటర్ బోర్డు ఎదుట ధర్నాకు సిద్దం అయితే. బిజెపి నిరవదిక దీక్షకు తయారవుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రాష్ట్ర కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ప్రకటించారు.
 
ప్రభుత్వం స్పందించే వరకు ఈ దీక్ష కొనసాగుతుందని అయన స్పష్టం చేశారు. ఇంటర్ దోషులను ప్రభుత్వం ఎందుకు కాపాడాలని చూస్తోందని నిలదీశారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నివేదిక పేరుతో ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అభ్యంతరం వ్యక్తం చేశారు.మంత్రి జగదీష్ రెడ్డిపై వారు ఆరోపణలు గుప్పించారు.Top