శ్రీలంక వెళ్లేవారికి హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..!

Written By Aravind Peesapati | Updated: April 29, 2019 10:10 IST
శ్రీలంక వెళ్లేవారికి హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..!

శ్రీలంక వెళ్లేవారికి హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..!
 
ఇటీవల 'ఈస్టర్' పర్వదినాన శ్రీలంక దేశంలో ఉగ్రవాదులు పలు చర్చిలపై మరియు కార్ హోటళ్లపై దాడులకు పాల్పడడం జరిగింది. శ్రీలంకలో జరిగిన దాడుల్లో చాలామంది క్రైస్తవులు మరియు కొంత మంది సామాన్యులు కూడా ప్రాణాలు విడిచారు. జరిగిన దాడి దృశ్యాలు చుసిన ప్రపంచ దేశాలు చాలావరకు చలించిపోయారు. ఈ నేపథ్యంలో ఉగ్రదాడుల క్రమంలో కేంద్ర ప్రభుత్వం శ్రీలంక దేశానికి వెళ్లకూడదని ప్రయాణాలు విరమించుకోవాలని ప్రజలకు హెచ్చరికలు సూచనలు జారీ చేసింది.
 
తప్పని సరి అయితేనే ఆ దశం వెళ్లండని, లేకుంటే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అడ్వైజరీని జారీ చేసింది. ‘శ్రీలంక ప్రభుత్వం దేశంలో భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. జాతీయ అత్యవసర పరిస్థితితో పాటు రాత్రిపూట కర్ఫ్యూ కూడా విధిస్తోంది. ఇవి మీ ప్రయాణాల మీద ప్రభావం చూపించవచ్చు. ఒకవేళ ఎవరైన అత్యవసర ప్రయాణాలు చేస్తున్నప్పుడు అవసరమైతే కొలంబోలోని హై కమిషన్‌ లేక హంబన్‌టోట, జాఫ్నాలో ఉన్న అసిస్టెంట్ హై కమిషన్‌ను సంప్రదించాలని కూడా కేంద్రం తెలిపింది.
Top