జగన్, విజయసాయి రెడ్డి త్వరలో ఇద్దరు జైలు కు వెళ్ళటం కాయం అంటున్న టీడీపీ నేత..!

Written By Aravind Peesapati | Updated: April 29, 2019 10:12 IST
జగన్, విజయసాయి రెడ్డి త్వరలో ఇద్దరు జైలు కు వెళ్ళటం కాయం అంటున్న టీడీపీ నేత..!

జగన్, విజయసాయి రెడ్డి త్వరలో ఇద్దరు జైలు కు వెళ్ళటం కాయం అంటున్న టీడీపీ నేత..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందని..తెలుగుదేశం పార్టీ నేతలపై మరియు ఇతర రాజకీయ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు విజయసాయి రెడ్డి పై టిడిపి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు. ఇటీవల విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన బుద్ధ వెంకన్న..ఎన్నికల ఫలితాలు వచ్చాక భవిష్యత్తు భారత ప్రధాని ని నిర్ణయించేది చంద్రబాబేనని తెలిపారు.
 
అంతేకాకుండా వైసీపీ పార్టీ అధినేత జగన్ దోచుకున్న దానిలో కేవ‌లం రూ.40వేల కోట్ల‌నే ఈడీ జ‌ప్తు చేసింద‌ని, ఇంకా కొన్ని ల‌క్ష‌ల కోట్లు వైసీపీ నేత‌ల వ‌ద్ద ఉన్నాయ‌ని బుద్దా వెంక‌న్న విమ‌ర్శించారు. ఆ ల‌క్ష‌ల కోట్ల నుంచే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయ‌ల‌ను మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ ఖ‌ర్చు పెట్టింద‌ని ఆరోపించారు. ఇంకా వైసీపీ నేత‌ల వ‌ద్ద ఉన్న ల‌క్ష‌ల రూపాయ‌ల ధ‌నాన్ని ప్ర‌జ‌ల ఖాతాలో జ‌మ చేయ‌డ‌మే కాకుండా విజ‌య‌సాయిరెడ్డిని, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని ఇద్ద‌ర్నీ కూడా చెంచ‌ల్‌గూడ జైలుకు పంపుతామ‌ని బుద్దా వెంక‌న్న అన్నారు.
Top