జగన్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన కేటీఆర్..!
ఎన్నికలు జరగక ముందు లోటస్ పాండ్ లో జగన్ కేటీఆర్ కలిసి భేటీ అయి రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించారు. అయితే ఆ సమయంలో జాతీయ రాజకీయాలలో కీలకం కాబోతున్న కేసీఆర్ జగన్ మద్దతు కోసం తన కొడుకు కేటీఆర్ ని పంపించి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై మంతనాలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీ లో ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో వైసీపీ పార్టీ అధినేత జగన్పై మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు ట్విట్టర్ లో చేశారు కేటీఆర్.
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ సరిపోతాడా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. తన అభిప్రాయంతో పని లేదని, ఆంధ్రా ప్రజలు దానిని నిర్ణయిస్తారన్నారు. తనకు అసలు ఏపీ రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదని కేటీఆర్ తెలిపారు. 2024 ఎన్నికల్లో ఏపీలో పోటీ గురించి నెటిజన్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, 2024 చాలా దూరంలో ఉందని సమాధానమిచ్చారు.