బీజేపీ వైపే జగన్ - కే‌సి‌ఆర్ అడుగులు? ఇదే ప్రూఫ్ ?

Written By Xappie Desk | Updated: May 18, 2019 10:03 IST
బీజేపీ వైపే జగన్ - కే‌సి‌ఆర్ అడుగులు? ఇదే ప్రూఫ్ ?

బీజేపీ వైపే జగన్ - కే‌సి‌ఆర్ అడుగులు ? ఇదే ప్రూఫ్?
 
2014 దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ మద్దతు లేకుండా సొంతంగా బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోడీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం మరియు పార్టీ లో ఉన్న పెద్దల పట్ల గర్వంగా ప్రవర్తించడం వంటి పరిణామాలతో దేశవ్యాప్తంగా ప్రజలంతా మోడీ తీరుపై చాలా అసహనం చెందటం జరిగింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమని చాలా సర్వేలు చెబుతున్నా నేపథ్యంలో ...జాతీయ పార్టీలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీల వైపు చూస్తున్నాయి. ఇదిలా ఉండగా రెండోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని బీజేపీ.. దక్షిణాదిలో ఉన్న టిఆర్ఎస్ మరియు వైకాపా పార్టీలను తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.
 
ఇదే విషయాన్ని ఇటీవల ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఇఐయుయు) తేల్చినట్లు సమాచారం. ఇందుమూలంగా నే రెండు తెలుగు రాష్ట్రాలలో తమకు అనుకూలంగా ఉన్న వైసిపి, టిఆర్ఎస్ పార్టీలకు ఎన్నికల సమయంలో ఆ రెండు పార్టీలకు మంచి జరిగేటట్టు కేంద్రంలో ఉన్న బీజేపీ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని...పాదయాత్ర అయిన వెంటనే ఆ వేవ్ లో మొదటి దశలోనే ఏపీలో ఎన్నికలు ఇవన్నీ బిజెపి వేసిన ఎత్తుగడలో భాగమే అని దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో అటు టిఆర్ఎస్ ఇటు వైసిపి పార్టీలు తమకు అనుకూలంగా వ్యవహరించిన బిజెపి పార్టీ వైపు రాబోయే రోజుల్లో అడుగులు వేస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి.
Top