లగడపాటి పై దారుణమైన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..!

Written By Aravind Peesapati | Updated: May 19, 2019 11:17 IST
లగడపాటి పై దారుణమైన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..!

లగడపాటి పై దారుణమైన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..!
 
ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికలపై తనదైన శైలిలో ఫలితాలను ప్రకటించారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో లగడపాటి మహాకూటమి గెలుస్తుందని చెప్పడం జరిగింది అయితే ఆ సమయంలో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో ప్రభుత్వం స్థాపించడం జరిగింది. దీంతో ఆ సమయంలో లగడపాటి చంద్రబాబు నాయుడు అమ్ముడుపోయారని అప్పట్లో అనేక కామెంట్స్ వినపడ్డాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీ లో జరిగిన ఎన్నికల ఫలితాలపై తన అంచనాలు అంటూ విజయవాడ మాజీ ఎమ్.పి లగడపాటి రాజోగోపాల్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి స్పందించారు.లగడపాటి గారూ... మీ పేరును నారా రాజగోపాల్‌గా మార్చుకోండి అంటూ ఘాటుగా ట్వీట్‌ చేశారు. ‘‘చంద్రబాబు స్కెచ్ లో భాగమే లగడపాటి సర్వే. 23న కౌంటింగ్ ప్రారంభం కాగానే బాబు ఏమంటాడంటే.. గెలుస్తామని లగడపాటి చెప్పాడు అయినా ఓడుతున్నామంటే అందుకు ఈవీఎం ట్యాంపరింగే కారణం అని చెప్పేందుకే ఈ గోల. ఆంధ్రా ఆక్టోపస్ కాదు... ఇది ఎల్లో జలగ! ’’ అని ఆయన ట్విటర్ వేదికగా ఎద్దేవ చేశారు.
Top