హీరో శివాజీ, రవిప్రకాష్ లకు నోటీసులు..!

Written By Aravind Peesapati | Updated: May 19, 2019 11:21 IST
హీరో శివాజీ, రవిప్రకాష్ లకు నోటీసులు..!

హీరో శివాజీ, రవిప్రకాష్ లకు నోటీసులు..!
 
ఇటీవల టీవీ9 రవి ప్రకాష్ ఫోర్జరీ కేసు రెండు తెలుగు రాష్ట్రాల ను కుదిపేసింది. అయితే ప్రస్తుతం పోలీసుల విచారణకు హాజరు కాకుండా గత కొన్ని రోజుల నుండి తప్పించుకుంటున్న రవి ప్రకాష్ శివాజీ ఇద్దరి పై రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. గత కొంత కాలం నుండి ఇద్దరికీ పోలీసులు నోటీసులు పంపుతున్న స్పందించకపోవడంతో తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేసినట్లు టీవీలలో వార్తలు వస్తున్నాయి. టివి 9 లో పోర్జరీ, నిదుల దుర్వినియోగం, లోగో అక్రమ అమ్మకం వంటి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు పోలీసుల విచారణకు రాకుండా గైర్ హాజరైన విషయం తెలిసిందే.ఈ నేపద్యంలో వారిపై లుకౌట్ నోటీసులు ఇచ్చారని సమాచారం. వారు విదేశాలకు వెళ్లకుండా దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలన్నిటిని అప్రమత్తం చేశారని వార్తలు సూచిస్తున్నాయి.పోలీసుల విచారణకు మూర్తి హాజరైనా , ఇప్పుడు ఆయన పేరు తో కూడా లుకౌట్ నోటీసు ఇవ్వడం విశేషం. కాగా రవిప్రకాష్, శివాజీలు ఎపిలో కీలకమైన రాజకీయ నేతల ఆశ్రయంలో ఉండవచ్చని కొన్ని పత్రికలలో కదనాలు వచ్చాయి.
Top