ఆ నియోజకవర్గాలలో గొడవ జరిగే ఛాన్స్ ఉందంటున్నారు వైసీపీ నేతలు..!

Written By Aravind Peesapati | Updated: May 19, 2019 11:24 IST
ఆ నియోజకవర్గాలలో గొడవ జరిగే ఛాన్స్ ఉందంటున్నారు వైసీపీ నేతలు..!

ఆ నియోజకవర్గాలలో గొడవ జరిగే ఛాన్స్ ఉందంటున్నారు వైసీపీ నేతలు...!
 
తాజాగా జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23 వ తారీఖున వస్తున్న నేపథ్యంలో ఏపీ లో ఉన్న ప్రధాన పార్టీల నేతలు ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా టిడిపి పార్టీ ఏ నియోజకవర్గాలలో తక్కువ ఓట్లు వస్తాయి అని వారికి అనుమానం కలుగుతుందో ఆ చోట గొడవలు సృష్టించడానికి టిడిపి స్కెచ్ లు వేస్తుందని వైసీపీ పార్టీ ఆరోపిస్తోంది. కౌంటింగ్ నాడు ఆ పార్టీ గొడవలు సృష్టించవచ్చని ఆరోపిస్తూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి , మాజీ ఎమ్.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి ,ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి తదితరుల బృందం ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసింది. వారు ఈ సందర్బంగా కొన్ని నియోజకవర్గాల పేర్లను కూడా ప్రస్తావించారు. గుడివాడ, తుని, గాజువాక, రాప్తాడు, భీమవరం, చంద్రగిరి మంగళగిరి, గురజాల,ఉరవకొండ, దెందులూరు ధర్మవరం, తాడిపత్రి , రాజంపేట, చిలకలూరి పేట, విశాఖ వెస్ట్ ,గన్నవరం, మైలవరం మొదలైన నియోజకవర్గాలలో గొడవలు సృష్టించడానికి టిడిపి ప్రయత్నిస్తుందని వారు సందేహం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంల టిడిపి నేత ఒకరు ఈవిఎమ్ లను రిగ్గింగ్ చేస్తున్న దృశ్యాలను గమనించే రీపోలింగ్ కు ఆదేశాలు ఇచ్చారని విజయసాయిరెడ్డి అన్నారు. కౌంటింగ్ నేపద్యంలో కేంద్ర బలగాలతో అదనపు బద్రత కల్పించాలని కోరామని ఆయన చెప్పారు.
Top