చంద్రబాబు రాహుల్ భేటీ..!

Written By Aravind Peesapati | Updated: May 19, 2019 11:29 IST
చంద్రబాబు రాహుల్ భేటీ..!

చంద్రబాబు రాహుల్ భేటీ..!
 
టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల ఫలితాలు దగ్గర పడే కొద్దీ చాలా టెన్షన్ పడిపోతున్నారు. ముఖ్యంగా ఫలితాలు రాకముందే చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ తో బేటీ అయ్యారు. ఎన్.డి.ఎ. యేతర కూటమిని బలోపేతం చేసే కృషిలో భాగంగా చంద్రబాబు రాహుల్ తో సంప్రదింపులు జరుపుతున్నారని కదనం.సుమారు గంట సేపు వీరిద్దరి మద్య చర్చలు జరిగాయి. కాగా మద్యాహ్నం లక్నో వెళ్లి బిఎస్పి అదినేత్రి మాయావతి, ఎస్పి అదినేత అఖిలేష్ యాదవ్ లతో చంద్రబాబు మాట్లాడినట్లు సమాచారం.ఇప్పటికే దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరితో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. అంతే కాకుండా ఇటీవల ఏపీ భవన్‌లో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజాతో కూడా చర్చించారు.ఈ నెల ఇరవైమూడు తర్వాత ఏర్పడే పరిస్థితులపై వీరితో చంద్రబాబు మాట్లాడినట్లు రాబోయే ఫలితాలను బట్టి ఏ విధంగా భవిష్యత్తులో అడుగులు వేయాలి వంటి అంశాలపై అందరిని చంద్రబాబు అప్రమత్తం చేసినట్లు సమాచారం.
Top