సంచలన నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్..!

సంచలన నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్..!

సంచలన నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్..!
 
తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ తనదైన శైలిలో దూసుకెళ్ళిపోతున్న పాలనలో. ముఖ్యంగా తనకు ప్రత్యర్థి పార్టీ లేకుండా ఎదురులేని రాజకీయ నాయకుడిగా తెలంగాణలో తనదైన శైలిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల కెసిఆర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.గోల్కొండ ఖిల్లా, సేరేడ్ గ్రౌండ్స్ వంటి చోట్ల నిర్వహిస్తున్న జాతీయ దినోత్సవాలను ఇకపై పబ్లిక్ గార్డెన్స్ లోనే నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. జూబ్లీహాలు ఎదురుగా ఉన్న స్థలాన్ని దీనికోసం ఎంపిక చేశారు. ఈ మూడు వేదికలు మారనున్నాయి. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా, మరింత వైభవంగా నిర్వహించేందుకు ఈ ప్రతిపాదన రాగా దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదముద్ర వేశారు. ఇకపై ఉత్సవాల సందర్భంగా పోలీసు సిబ్బంది కవాతులు జరపరాదని ఆదేశించారు. విద్యార్థులను ఉత్సవాలకు తీసుకొచ్చే విధానానికి స్వస్తి పలకాలన్నారు. మూడు ఉత్సవాలను ప్రజలకు, విద్యార్థులకు. పోలీసులకు యాతన లేకుండా గొప్పగా, సౌకర్యవంతంగా, నిర్వహించడానికి ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించాలని సీఎం చెప్పారు.Top