చీరాల నియోజకవర్గం అభివృద్ధిలో పదేళ్లు వెనక్కి..?

Written By Aravind Peesapati | Updated: May 27, 2019 11:16 IST
చీరాల నియోజకవర్గం అభివృద్ధిలో పదేళ్లు వెనక్కి..?

చీరాల నియోజకవర్గం అభివృద్ధిలో పదేళ్లు వెనక్కి..?
 
రెండు రాష్ట్రాల రాజకీయంలో చీరాల రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతోంది. మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో గెలుపు ఓటముల విషయంలో పరిణామాలు ఎప్పుడు ఆసక్తికరంగానే నడుస్తున్నాయి. ముఖ్యంగా 2019 ఎలక్షన్ విషయంలో చీరాల విషయంలో జనం తీర్పు రాష్ట్ర రాజకీయాలు అనేక పరిణామాలకు దారితీసింది అనడం అతిశయోక్తి కాదు. చాలా చోట్ల ఎలక్షన్ ఫలితాలు వచ్చిన 72 గంటలు నడుస్తున్న “ఏంటి ఆమంచి ఓడిపోయాడట” కదా అంటూ చర్చలు నడుస్తున్నాయి. ఇండిపెండెంట్ గా చాలా సునాయాసంగా గెలిచిన ఆమంచి ఈ ఫ్యాన్ గాలి సునామీలో ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే చంద్రబాబు ఓవర్ ఫోకస్ వలన ఇక్కడ ఆమంచి గెలిచారు అని అదే చంద్రబాబు కి స్టేట్ లో బ్యాక్ ఫైర్ అయ్యింది అని అంటున్నారు కొందరు ప్రకాశం జిల్లా రాజకీయవిశ్లేషకులు...ఆ మాట అనడం వెనుక పెద్ద కథే ఉంది. నిజానికి ఆమంచి కృష్ణమోహన్ మీద గెలిచిన కరణం బలరాం కి 2023 దాకా ఎమ్మెల్సీ పదవి ఉందనే ఉంది. ఇంత అర్జెంటుగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరమే లేదు కానీ పరిస్థితుల దృష్ట్యా కేవలం ఆమంచి తన మీద తిరగబడ్డాడు, స్టేట్ వైడ్ గా తన కుల కరప్షన్ రాజకీయాలను బయట పెట్టాడు అనే కారణంతో చంద్రబాబు ఆమంచిని టార్గెట్ గా చేసుకుని ఇక్కడ కరణం నీ రంగంలోకి దింపాడు..కరణం కూడా తన 75వ ఏట అత్యాశ, దురాశకు పోయే చీరాల ని తాను గెలిచిన తన కొడుక్కి ఎమ్మెల్సీ ఇచ్చు కుందామనే కంగారులో డబ్బులు అధికారం అడ్డంపెట్టుకుని గెలిచారు బాగానే ఉంది. కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ఈ ప్రాంతంలో నిధుల దగ్గర నుంచి కరణం ప్లాన్ చేసినట్లుగా ఆయన కొడుకు యొక్క భవిష్యత్తు, ప్లానింగ్, అనేక అంశాల్లో వైకాపా నుంచి తలనొప్పులు తప్పవు. తద్వారా చీరాల ని తిరుగులేని అభివృద్ధి వైపు నడుపుతున్న ఆమంచి ని అడ్డుకుని చీరాల ని మరొక పదేళ్లు వెనక్కి లాగి నట్టు అయింది ఇక్కడి పరిస్థితి. ఇలాంటి వ్యక్తి నా మేము నమ్మింది అనే పరిస్థితి లోకి ఆమంచి జనాలు వెళ్లిపోయే సంఘటనలు జరగబోతున్నాయి అనేది లోకల్ గా వినిపిస్తున్న మాట...చంద్రబాబు విష చదరంగంలో తాను ఒక పావుగా మారిన కరణం ఇప్పుడు చీరాల అభివృద్ధికి తనకి తెలియకుండానే మోకాలు అడ్డం పెట్టినట్టుగా అయ్యింది ఇప్పుడు కథ. చంద్రబాబు ముట్టుకుంటే పాజిటివ్ లు కూడా నెగిటివ్ లు అవుతాయి అని అనడానికి చీరాల రాజకీయమే నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు.
Top