గెలిచిన ఆనందంలో నోరు జారి కేసులో ఇరుక్కున్న టీడీపీ ఎమ్మెల్యే..?

Written By Aravind Peesapati | Updated: May 27, 2019 11:22 IST
గెలిచిన ఆనందంలో నోరు జారి కేసులో ఇరుక్కున్న టీడీపీ ఎమ్మెల్యే..?

గెలిచిన ఆనందంలో నోరు జారి కేసులో ఇరుక్కున్న టీడీపీ ఎమ్మెల్యే..?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఎవరు ఊహించని విధంగా జగన్ 2019 ఎన్నికల్లో కొత్త చరిత్రని సృష్టించాడు. చాలా చోట్ల గెలుస్తారు అని తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఓడిపోవడం టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు కి ఆశ్చర్యాన్ని గురిచేసింది. కొన్ని కొన్ని చోట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రెండోసారి గెలవడం జరిగింది. ఈ క్రమంలో విశాఖపట్టణం తూర్పు అసెంబ్లీ స్థానం నుండి రెండో దఫా విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణ బాబు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆదివారం నాడు కేసు నమోదైంది. వైజాగ్ తూర్పు అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో రామకృష్ణ బాబు జగన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోడీ, జగన్‌పై కూడ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రామకృష్ణబాబుపై కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Top