పోలవరం ప్రాజెక్టు పై షాకింగ్ కామెంట్స్ చేసిన జగన్..!

పోలవరం ప్రాజెక్టు పై షాకింగ్ కామెంట్స్ చేసిన జగన్..!

పోలవరం ప్రాజెక్టు పై షాకింగ్ కామెంట్స్ చేసిన జగన్..!
 
వైసీపీ పార్టీ అధినేత జగన్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన నేపథ్యంలో త్వరలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఆర్థిక పరిస్థితిపై రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన మోడీకి వివరించడం కోసం ఢిల్లీ వెళ్లడం జరిగింది. ఆదివారంనాడు ఢిల్లీ వెళ్లిన జగన్ మోడీ కి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి చర్చించడం జరిగింది. మోడీ తో చర్చలు జరిగిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన జగన్ పోలవరం ప్రాజెక్టు గురించి షాకింగ్ కామెంట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షించి అవసరమైతే రీ టెండర్లను పిలుస్తామని జగన్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. కానీ, పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాల్సిన అవసరం మాత్రం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తేలితే టెండర్లను రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలో త్వరలో నిర్ణయం తీసుకొంటామని ఆయన తెలిపారు.Top