జగన్ తో భేటీ తర్వాత సంచలన ట్వీట్ చేసిన ప్రధాని మోడీ..!

Written By Aravind Peesapati | Updated: May 27, 2019 11:32 IST
జగన్ తో భేటీ తర్వాత సంచలన ట్వీట్ చేసిన ప్రధాని మోడీ..!

జగన్ తో భేటీ తర్వాత సంచలన ట్వీట్ చేసిన ప్రధాని మోడీ..!
 
వైసిపి పార్టీ అధినేత జగన్ తాజాగా ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోడీ ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి తెలియజేసి అలాగే రెండోసారి ప్రధాని గా ఎన్నికవడంతో శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల 30 వ తారీఖున తన ప్రమాణ స్వీకారానికి కూడా మోడీని జగన్ ఈ సమావేశంలో ఆహ్వానించడం జరిగింది. అయితే జగన్తో భేటీ అయిన అనంతరం ప్రధాని మోడీ ట్వీటర్ లో షాకింగ్ ట్వీట్ చేశారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ పట్ల ప్రధాని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. దాదాపు గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని సమస్యలు, విభజన హామీలను జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం భేటీ వివరాలను ప్రధాని ట్వీట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ‘‘ ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిపాం. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇస్తున్నాను’’ అంటూ మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.
Top