ఎన్నికల్లో ఓడిపోయాక తొలిసారి స్పందించిన నారా లోకేశ్..!

Written By Aravind Peesapati | Updated: May 27, 2019 11:37 IST
ఎన్నికల్లో ఓడిపోయాక తొలిసారి స్పందించిన నారా లోకేశ్..!

ఎన్నికల్లో ఓడిపోయాక తొలిసారి స్పందించిన నారా లోకేశ్..!
 
ప్రజా క్షేత్రంలో మొట్టమొదటిసారి ప్రజల మధ్య గెలిచి అడుగు కడదామని అనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కి మంగళగిరి ప్రజలు దిమ్మతిరిగిపోయే విధంగా తీర్పు ఇవ్వడంతో నారా లోకేష్ ఓటమి ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తన ఓటమి తరువాత మొట్టమొదటి సారి స్పందించారు నారా లోకేష్. ట్విటర్ ద్వారా స్పందించి ఓటమిపై కార్యకర్తలు అదైర్య పడవద్దని ఆయన అన్నారు. మరింత బాద్యతతో పనిచేసి ప్రజలకు దగ్గరవుదామని ఆయన అన్నారు. ఫలితాలపై విశ్లేషించుకుని భవిష్యత్తు కార్యాచరణ సిద్దం చేసుకుందామని పిలుపునిచ్చారు. అందరికి పార్టీ అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు. ‘ప్రజలు ఎవరికి ఓటువేసినా సరే నా మాట మారదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు నా కుటుంబ సభ్యులు. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కష్టం నష్టం, సంతోషం సంబరం ఏదైనా సరే మీతోనే నా ప్రయాణం. నేను మీలో ఒకడిని మీవాడిని.’ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి జరిగేవని, వాటివల్ల అధికార మార్పిడి జరగొచ్చు కానీ కార్యకర్తలతో తనకు ఉన్న అనుబంధాన్ని మారదన్నారు. మంగళగిరి నియోజకవర్గం తన ఇల్లు అని, అక్కడి ప్రజలంతా నా కుటుంబమని ప్రచారంలో చెప్పింది వట్టి మాటలు కాదని, గడప గడపకు వెళ్లానని, గెలిచినా ఓడినా వారితోనే ఉంటానని లోకేష్ తెలిపారు.
Top