రెండోసారి ప్రధాని అయ్యాక సంచలన నిర్ణయం తీసుకున్న మోడీ..!

Written By Aravind Peesapati | Updated: June 01, 2019 14:48 IST
రెండోసారి ప్రధాని అయ్యాక సంచలన నిర్ణయం తీసుకున్న మోడీ..!

రెండోసారి ప్రధాని అయ్యాక సంచలన నిర్ణయం తీసుకున్న మోడీ..!
 
ఇటీవల మే 30 వ తారీకు రెండోసారి భారత ప్రధాని గా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ..తన పాలనలో గతానికి భిన్నంగా దూకుడుగా ఎర్రగా లో తీసుకునే విధంగా ముందుకు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గం కొత్త నిర్ణయాలు తీసుకుందని చిల్లర వర్తకులకు పించన్ లు ఇవ్వాలని నిర్ణయించడం విశేషం. దీంతో సుమారు మూడు కోట్ల మంది కి ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలోని రైతులందరికీ పీఎం కిసాన్‌ యోజన పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏటా దాదాపు రూ.14.5 కోట్ల మంది రైతులకు రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులకు పింఛను పథకానికి కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
ఉగ్రదాడులు, నక్సల్స్‌ దాడుల్లో అమరులైన జవాన్ల పిల్లలకు నెలనెలా భారత రక్షణ నిధి నుంచి ఇచ్చే ఉపకార వేతనాల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలి సంతకం చేశారు. బాలురకు నెలకు ఇచ్చే రూ.2వేల ఉపకారవేతనాన్ని రూ.2500లకు పెంచారు. అలాగే, బాలికలకు ఇచ్చే రూ.2250ను రూ.3వేలకు పెంచాలని నిర్ణయించారు.
Top