పశ్చిమ బెంగాల్ లో మమతా కి మొదలైన తలనొప్పులు…!

Written By Aravind Peesapati | Updated: June 01, 2019 14:52 IST
పశ్చిమ బెంగాల్ లో మమతా కి మొదలైన తలనొప్పులు…!

పశ్చిమ బెంగాల్ లో మమతా కి మొదలైన తలనొప్పులు…!
 
రెండోసారి మోడీ రావడంతో పశ్చిమ బెంగాల్ లో ఉన్న బిజెపి పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. దీంతో ఇటీవల జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రచారంలో మోడీ కి తలనొప్పిగా మారిన మమతా బెనర్జీకి చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఇటీవల పశ్చిమబెంగాల్లో మమతా కి వ్యతిరేకంగా పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఇటీవల లోక్సభ ఎన్నికలు జరిగిన క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో స్థానాలు రాకపోవడంతో అదే క్రమంలో బీజేపీ పశ్చిమబెంగాల్లో పుంజుకోవడంతో పశ్చిమబెంగాల్లో పరిస్థితులు మొత్తం మమతా బెనర్జీ కి వ్యతిరేకంగా అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా మమతా బెనర్జీ తన పార్టీకి సంబంధించిన కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఆమె కాన్వాయ్ని కొంతమంది దుండగులు అడ్డుకోవడంతో పరిస్థితి రణ గోల గా మారింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో కాన్వాయ్కి అడ్డు పడిన వారు పోలీసుల రాకతో చెల్లాచెదురయ్యారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ..స్థానిక ప్రజలు కాదు. హిందీ మాట్లాడే ప్రజలతో నాకు ఎలాంటి వైరం లేదు. కానీ బెంగాల్ ప్రాంతానికి చెందని కొంతమంది రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అయినా కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో వారిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. 2021లో భాజపా ఒక్క సీటు కూడా గెలవదని ఆమె అన్నారు.
Top