అసెంబ్లీ స్పీకర్ గా రెండు పేర్లను పరిశీలిస్తున్న జగన్..!

Written By Aravind Peesapati | Updated: June 01, 2019 14:58 IST
అసెంబ్లీ స్పీకర్ గా రెండు పేర్లను పరిశీలిస్తున్న జగన్..!

అసెంబ్లీ స్పీకర్ గా రెండు పేర్లను పరిశీలిస్తున్న జగన్..!
 
ఇటీవల మే 30 వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జగన్. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్గా ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఎక్కువగా సౌమ్యంగా మరియు నిబద్ధతతో కలిగి వ్యక్తులను స్పీకర్గా పెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు బాపట్ల నియోజకవర్గాలకు చెందిన మేకతోటి సుచరిత, కోన రఘుపతి పేర్లను జగన్ పరిశీలిస్తున్నట్టు పార్టీల నుండి వస్తున్న సమాచారం. మేకతోటి సుచరిత ఇప్పటికి మూడు సార్లు గెలిచారు. కాంగ్రెస్ తరపున గెలిచిన మేకతోటి రాజీనామా చేసి జగన్ తో పాటు బయటకు వచ్చేశారు. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో గెలిచారు. మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించారు. అంటే మూడుసార్లు గెలిచినట్లే. అలాగే కోన రఘుపతి కూడా 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచారు. సౌమ్యునిగా కోనకు పేరుంది. పైగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు. అందులో రఘుపతి తండ్రి కోన ప్రభాకర్ రావు కూడా గతంలో అంటే 1980-81 మధ్య కాలంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. ఒకవేళ స్పీకర్ పదవికి రఘుపతిని ఎంపిక చేస్తే బహుశా రికార్డవుతుందేమో. ఎందుకంటే తండ్రి, కొడుకులు అసెంబ్లీకి స్పీకర్లుగా పని చేసిన ఘటన రాష్ట్రంలో ఎవరి విషయంలోను జరగలేదు. మరి జగన్ మనసులో ఏముందో రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
Top