మరోసారి చంద్రబాబు కి దెబ్బ వేసిన మెగా బ్రదర్స్..!

Written By Aravind Peesapati | Updated: June 01, 2019 15:03 IST
మరోసారి చంద్రబాబు కి దెబ్బ వేసిన మెగా బ్రదర్స్..!

మరోసారి చంద్రబాబు కి దెబ్బ వేసిన మెగా బ్రదర్స్..!
 
2009 ఎన్నికలలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఓడిపోయిందని చాలా మంది రాజకీయ నేతలు కామెంట్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల విషయంలో మరొకసారి మెగా బ్రదర్స్ వల్ల చంద్రబాబు అధికారానికి దూరమయ్యాడని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు విషయంలోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ 2019 ఎన్నికలలో మొట్టమొదటిసారి పోటీచేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు ఎక్కువగా చీలినట్లు తాజాగా బయటకు వచ్చిన ఫలితాలను బట్టి అర్థం అవుతున్నాయి. నిజానికి పవన్ కల్యాణ్ ను రంగంలోకి దించిందే చంద్రబాబు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చటానికి వైసిపి అభ్యర్ధులను దెబ్బకొట్టటానికే జనసేన అభ్యర్ధులను చంద్రబాబు రంగంలోకి దించారు. కాకపోతే చంద్రబాబు ఒకటనుకుంటే పోలింగ్ రోజు జరిగింది మరోటి. వైసిపిని దెబ్బ కొడదామని అనుకుంటే చివరకు టిడిపినే జనసేన దెబ్బకు బలైపోయిందట. సుమారు 36 నియోజకవర్గాల్లో జనసేన దెబ్బ టిడిపికి తగిలినట్లు తాజా ఫలితాలలో తేలింది. ఏది ఏమైనా మెగా బ్రదర్స్ దెబ్బ రెండు సార్లు తెలుగుదేశం పార్టీకే తగిలింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Top