జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే..!

Written By Aravind Peesapati | Updated: June 01, 2019 15:07 IST
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే..!

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే..!
 
వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పాదయాత్ర నిర్వహించారు. ఆయన శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ తల్లి దేవాలయం నుంచి పాదయాత్రగా ద్వారకా తిరుమల చేరుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అయిదేళ్ల పాలన విజయవంతంగా సాగాలంటూ పాదయాత్ర చేశనని ఆయన చెప్పారు. ఈ అయిదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గ ప్రజలకు ‘నవరత్నాలు’ పూర్తి స్థాయిలో అందేలా కృషి చేస్తా.’ అని హామీ ఇచ్చారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు అందుబాటులో ఉద్యోగాలు కల్పించేలా జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని. తాను కూడా విదేశాలలో ఐటీ వంటి రంగాలలో రాణించిన వ్యక్తిని కాబట్టి కచ్చితంగా రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా జగన్ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు అబ్బయ్య చౌదరి తెలిపారు. తాజాగా జరిగిన 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉండే చింతమనేని ప్రభాకర్ పై అబ్బయ్య చౌదరి గెలవడంతో రాష్ట్ర రాజకీయాలలో అబ్బయ్య చౌదరి పేరు మారుమ్రోగిపోయింది.
Top