టార్గెట్ జగన్ మొదలెట్టిన బీజేపీ?

Written By Xappie Desk | Updated: June 08, 2019 10:33 IST
టార్గెట్ జగన్ మొదలెట్టిన బీజేపీ?

టార్గెట్ జగన్ మొదలెట్టిన బీజేపీ?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా అయినా వైసీపీ అధినేత జగన్ ... రాష్ట్ర ఖజానాలో చంద్రబాబు ఏమీ మిగల్చకుండా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని... ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని తమ సుఖభోగాలకు దుర్వినియోగం చేశారని ఖాళీ ఖజానాను అప్పజెప్పారని... ఇటువంటి క్రమంలో రాష్ట్రంలో ఖజానాకు రావలసిన ఆదాయ వనరులపై అధికారులు దృష్టి పెట్టాలని జగన్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుండగా మరోపక్క నాలుగు రోజులు కూడా గడవక ముందే రంజాన్ సందర్భంగా గుంటూరులో నిర్వహించిన ఒక ఇఫ్టార్ విందు కోసం ఏకంగా 1.1 కోట్లు ఖర్చు చేశారు. దీని కోసం ప్రభుత్వం మెరుపు వేగంతో నిధులు రిలీజ్ చేసింది.
 
ఈ ఖర్చు చూసిన చాలా మంది నిధులు లేవని ఇంతలా ఎలా ఖర్చు పెడుతున్నారు అంటూ ఆశ్చర్యపడ్డారు. ఇక భాజాపా నేత జీవిఎల్. నరసింహం అయితే ఏపీ రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రం. బాబు దుబారా ఖర్చులతో దాన్ని ఇంకా దెబ్బతీశారు. లౌకిక దేశంలో మతపరమైన పండుగలకు ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయడం తగదు. కొత్త సిఎం ఇలాంటి పోకడలకు భవిష్యత్తులో దూరంగా ఉంటారని ఆశిస్తున్నా అని జగన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుని ఉద్దేశించి మాట్లాడారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి నేతలు వ్యాఖ్యలు చూస్తుంటే జగన్ ని గట్టిగానే టార్గెట్ చేసినట్లు ఉంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Top