స్పెషల్ స్టేటస్ పై సంచలన కామెంట్స్ చేసిన బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ..!

Written By Xappie Desk | Updated: June 08, 2019 14:52 IST
స్పెషల్ స్టేటస్ పై సంచలన కామెంట్స్ చేసిన బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ..!

స్పెషల్ స్టేటస్ పై సంచలన కామెంట్స్ చేసిన బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతనంగా ముఖ్యమంత్రి అయిన వైసీపీ అధినేత జగన్ ఏపీ రాష్ట్రానికి కావాలంటున్న స్పెషల్ స్టేటస్ తప్ప మిగతావి ఏది అడిగినా కచ్చితంగా ప్రధాని మోడీ చేస్తారని... ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి జగన్ గారు ఎన్ని ప్రయత్నాలు జరిగినా లాభం ఉండదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇటీవల తిరుపతిలోని మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీడియాకి వెల్లడించారు. ‘ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా’ అంశం ముగిసిన అధ్యాయమని.. అయినా.. సీఎం జగన్ మోదీని అడిగితే అభ్యంతరం లేదని పేర్కొన్నారు. హోదా విషయం తప్ప.. జగన్ ఇంకేమడిగినా మోదీ చేస్తారని తేల్చిచెప్పారు. చంద్రబాబైనా, జగనైనా ప్రజలను మోసం చేయడం మానుకోవాలన్నారు. రాష్ట్రానికి నిధుల విషయంలోనైనా, అభివృద్ధి విషయంలోనైనా సహాయమందించడానికి మోదీ ముందుంటారని స్పష్టం చేశారు కన్నా లక్ష్మీనారాయణ.
Top