ఐదుగురు డిప్యూటీ సీఎం లు జగన్ కి పాజిటివా నెగెటివా?

ఐదుగురు డిప్యూటీ సీఎం లు జగన్ కి పాజిటివా నెగెటివా?

ఐదుగురు డిప్యూటీ సీఎం లు జగన్ కి పాజిటివా నెగెటివా ?
 
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన క్యాబినెట్ మంత్రులను ఇటీవల ఎంపిక చేసుకున్నారు. దేశంలో ఎన్నడూలేని విధంగా ఏ రాష్ట్రంలో ఇటువంటి ఎంపిక ఎక్కడా కూడా జరగలేదు. తన క్యాబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎం లు పదవులు సామాజిక న్యాయంతో ఐదు మందికి పదవి అప్ప చెప్పడం జరిగింది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు రాజకీయ విశ్లేషకులు షాక్ తిన్నారు. ముఖ్యంగా ఈ నిర్ణయంతో జగన్ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన విధంగా ప్రజల లోకి వెళ్ళింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు కాపులకు. ఇలా ఐదు సామాజిక వర్గాల నుంచి ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. పాదయాత్ర నుంచి ఎన్నికల వరకు తనకు అండగా ఉన్న అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలానే ఇక 25 మందితో కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్న జగన్ రెండున్నరేళ్ల తర్వాత 20 మంది మంత్రులను మారుస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనితో పాలన లో జగన్ నూతన విధానాన్ని అవలంబిస్తున్నారు. మొత్తంమీద ఐదుగురు డిప్యూటీ సీఎం లు అన్న జగన్ నిర్ణయం జగన్ కి పాజిటివ్ గని నెగిటివ్ అనేది ఎటువంటి కోణంలో లేదు.Top