చిరంజీవి లేకపోతే వైకాపా లో ఈ ఎమ్మెల్యే లేడు

Written By Aravind Peesapati | Updated: June 10, 2019 13:53 IST
చిరంజీవి లేకపోతే వైకాపా లో ఈ ఎమ్మెల్యే లేడు

చిరంజీవి లేకపోతే వైకాపా లో ఈ ఎమ్మెల్యే లేడు
 
కాకినాడ ప్రాంతానికి చెందిన కురసాల కన్నబాబు కి ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ క్యాబినెట్ మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పించారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ జగన్ పై మరియు చిరంజీవిపై పొగడ్తల వర్షం కురిపించారు. కన్నబాబు కి జగన్ ఉత్తమ త్యాగం నీటిలో వ్యవసాయ శాఖను అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో కాకినాడ ప్రాంతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు తనకి 44వేల ఓట్లు రావడం జరిగాయని..అది చూసి జగన్ తనకు తూర్పుగోదావరి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పచెప్పారని అన్నారు. ఈ సారి వైసీపీ నుంచి కాకినాడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాకుండా నా గెలుపు కోసం రెండు సార్లు కాకినాడలో ప్రచారం చేసారని ఆయన వలనే నేను గెలిచానని చెప్పుకొచ్చారు. అంతేకాదు తనకు మంత్రివర్గంలో కూడా అవకాశం కలిపించి కీలకమైన వ్యవసాయ శాఖను అప్పచెప్పారని, జ‌ర్న‌లిస్టు వృత్తిని ఒక సామాజిక బాధ్య‌త‌గా భావించి ఏ విధంగా ప‌నిచేశానో మంత్రిగా కూడా అదే విధంగా పనిచేస్తానని చెప్పారు. అయితే తాను ఎప్పుడూ మంత్రి అవుతాననని అనుకోలేదని, ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్ నమ్మకాన్ని తప్పకుండా నిలబెడతానని అన్నారు. అంతేకాదు అస‌లు నేను రాజ‌కీయాలలోకి రావ‌డానికి మెగాస్టార్ చిరంజీవి గారే ప్రధాన కారణమని ఈ సందర్భంగా ఆయనకు నా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నానని, ఆయనకునా జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. మరియు అదే విధంగా కన్నబాబు మంత్రి అవ్వడం పట్ల చిరంజీవి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి లేకపోతే కన్నబాబు లేనట్టే అన్నట్టుగా కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
Top