మేము కాదు జగన్ నిజమైన హీరో అంటున్న టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో..!

Written By Aravind Peesapati | Updated: June 10, 2019 13:57 IST
మేము కాదు జగన్ నిజమైన హీరో అంటున్న టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో..!

మేము కాదు జగన్ నిజమైన హీరో అంటున్న టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో..!
 
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పాలలో స్పీడ్ పెంచారు వైసిపి పార్టీ అధినేత జగన్. ఒక పక్క సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ మరోపక్క క్యాబినెట్ సిద్ధం చేసుకున్న జగన్..రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ స్టార్ హీరో కృష్ణంరాజు నిజమైన హీరో జగన్ ఏమి మేము కాదు అన్నట్టు గా వ్యాఖ్యానించారు. జగన్ పాలన పై ప్రశంసల వర్షం కురిపించారు. 'పరిణతి చెందిన ప్రజానాయకుడిగా మీరు స్పీకర్ పదవి బీసీలకు, డిప్యూటీ స్పీకర్ పదవి బ్రాహ్మణులకు కేటాయించడం చాలా మంచి నిర్ణయం. ప్రజల అఖండ అభిమానం చూరగొన్న నాయకుడిగా.. పిన్న వయసులోనే ప్రజానేతగా ఎదిగిన మీరు 'రాజకీయాల్లో రియల్ హీరో'.. మీరు, మీ మంత్రిమండలి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలనే ధ్యేయంగా ముందడుగు వేస్తారని నా గట్టి నమ్మకం. రాష్ట్ర పురోభివృద్ధిలో మీ పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబోతోందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోకి ముఖ్యమంత్రి హోదాలో మీరు తొలిసారిగా అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని కృష్ణంరాజు పేర్కొన్నారు.జగన్ సామాజిక న్యాయం పాటించడాన్ని ఆయన అబినందించారు.
Top