సుచరిత కి హోం మంత్రి పదవి ఇవ్వడం వెనక చాలా పెద్ద కథ ఉంది?
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కేబినెట్లో హోం మంత్రి శాఖను మహిళకు కట్టబెట్టడంతో అందరూ షాక్ తిన్నారు. జగన్ తీసుకునే నిర్ణయం పట్ల చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచన అనుసరిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. 2009 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో వైఎస్ హోం శాఖను సబితా ఇంద్రారెడ్డికి కట్టబెట్టటం జరిగింది. అప్పుడు వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయం ఆంధ్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కు జగన్ హోంశాఖ కేటాయించడం తో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం అందరికి షాక్ కు గురి చేసింది. అంతేకాకుండా గతంలో జగన్ తన కొలువులో ఉప ముఖ్యమంత్రి పదవిని ఎస్సీ సామాజికవర్గానికి కట్టబెడతానని చెప్పినప్పుడే ఆమెకు అవకాశం దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే హోం శాఖను కేటాయిస్తారని మాత్రం ఎవరూ ఊహించలేదు.మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ...తన పాలనలో తీసుకొన్న నిర్ణయాలను తన తండ్రిని గుర్తుకు తెస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.