కేంద్రం నుంచి ఏపీకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది: మోడీ

Written By Aravind Peesapati | Updated: June 10, 2019 20:40 IST
కేంద్రం నుంచి ఏపీకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది: మోడీ

కేంద్రం నుంచి ఏపీకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది: మోడీ
 
రెండోసారి ప్రధాని అయ్యాక మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ తిరుపతి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రాకకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్... ముఖ్యమంత్రి జగన్ మరియు ఇతర అధికారులు మోడీ కి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తిరుపతి పర్యటనలో మాట్లాడుతూ... ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎపిలో ఆయన కలలు నెరవేరాలని, ఆయన ఎపి అబివృద్ది కి కృషిచేయాలని, కేంద్రం వైపు నుంచి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్దమని ప్రధాని ప్రకటించారు. ఆంద్రప్రదేశ్ అనేక అవకాశాలు ఉన్న ప్రదేశమని ఆయన అన్నారు. ఎంతో విజ్ఞానవంతమైన రాష్ట్రమని,సాంకేతిక నిపుణులు ఎందరో ఉన్నారని, అంతా కొత్త సంకల్పంతో ముందుకు రావాలని, తద్వారా నవ భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. సబ్ కో సాత్,సబ్ కో వికాస్ నినాదాన్ని వాస్తవం చేయాలని మోడీ అన్నారు. ఎన్నికలు పూర్తి అయిపోయాక, ప్రజలలో ఎన్నో ఆశలు పెరిగాయని, మోడీ ఏమి చేస్తారన్న చర్చ జరుగుతోందని, దేశ ప్రగతి కోసం తాను నిరంతరం శ్రమిస్తానని ఆయన అన్నారు.
Top