అసలు ఆ విషయం గురించి నోరెత్తని మోడీ..!

Written By Aravind Peesapati | Updated: June 10, 2019 20:42 IST
అసలు ఆ విషయం గురించి నోరెత్తని మోడీ..!

అసలు ఆ విషయం గురించి నోరెత్తని మోడీ..!
 
ప్రధాని మోడీ తిరుపతి పర్యటనలో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన ముఖ్యమైన హామీల గురించి పెద్దగా ప్రస్తావించకపోవడం ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. తాజాగా జరిగిన దేశవ్యాప్తంగా ఎన్నికలలో ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ ఎపికి ప్రత్యేక మైన హామీలు ఏమీ ఇవ్వలేదు. అదే సమయంలో టిడిపి ఓటమి గురించి కాని, గత ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి కాని ఒక్క మాట ప్రస్తావించలేదు. ముఖ్యమంత్రి జగన్ కు అభినందనలు చెప్పి అన్ని విదాలుగా సహకరిస్తామని అన్నారు. ఎపి, తమిళనాడులలో బిజెపి విజయం సాదించే దిశగా అడుగులు వేయాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. అయితే కొందరు ఇంకా ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోలేదని ఆయన పరోక్షంగా కాంగ్రెస్, టిడిపిలను ఉద్దేశించి మోడీ అన్నారు. కేవలం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఆశీస్సులు పొందడానికే తాను ఇక్కడకు వచ్చానని మోడీ తెలియచేశారు. చివరిగా ఆయన అందరికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రసంగం ముగించారు. టిడిపి గురించి ,చంద్రబాబు గురించి మాట ఎత్తలేదు. అలాగే ప్రత్యేక హోదా తదితర అంశాల గురించి కూడా మోడీ ప్రస్తావించలేదు.
Top