పవన్ కళ్యాణ్ ఫై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..!

పవన్ కళ్యాణ్ ఫై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..!

పవన్ కళ్యాణ్ ఫై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అతి దారుణంగా ఓడిపోవడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం ఒకే ఒక స్థానంతో జరిగిన ఎన్నికలలో జనసేన సరిపెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం పై చాలా మంది బాధ పడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీకి దారుణమైన ఓటమి రావడంపై మంగళగిరిలో పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. జరిగిన ఎన్నికలలో తాను పోటీ చేసిన రెండు చోట్లా దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టారని పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై షాకింగ్ కామెంట్ చేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల కు గట్టిగానే కౌంటర్ వేసేశారు రామ్ గోపాల్ వర్మ. తనను భీమవరంలో ఓడించడానికి 150 కోట్లు ఖర్చు చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై వర్మ ట్విటర్ లో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. నిజంగనే పవన్ కళ్యాణ్ ను ప్రజలు గెలిపించదలిస్తే, ఎదుటివారు డబ్బులు ఇచ్చినా తీసుకుని ఆయనకే ఓట్లు వేసేవారు కదా అని వర్మ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఓటర్లను అవమానించే విదంగా మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు.Top