నాకు మోడీ అంటే భయం లేదు అంటున్న పవన్ కళ్యాణ్..!

Written By Aravind Peesapati | Updated: June 10, 2019 20:50 IST
నాకు మోడీ అంటే భయం లేదు అంటున్న పవన్ కళ్యాణ్..!

నాకు మోడీ అంటే భయం లేదు అంటున్న పవన్ కళ్యాణ్..!
 
ఏపీలో ఓడిపోయిన తర్వాత భవిష్యత్తులో పార్టీ ఎలాగా ముందుకు తీసుకువెళ్లాలి వంటి విషయాల గురించి మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ సంచలన కరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంత ఓటమి వచ్చినా కానీ రాజకీయాలలో నిలబడడం అనేది ఆషామాషీ కాదని..పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన చివరి శ్వాస వరకు ప్రజల శ్రేయస్సు కోసమే పోరాడతానని ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ జెండా ఎగరేస్తాం అని స్పష్టం చేశారు. ఇంకా మాట్లాడుతూ "బీజేపీ పక్షాన చేరొచ్చు కదా అని కొందరు అడిగారు. వాళ్లకు చెప్పేదొక్కటే. నాకు బీజేపీతో గానీ, ప్రధాని మోదీతో గానీ వ్యక్తిగత వైరం ఏమీలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, హక్కుల గురించి అడిగానంతే. ఇవాళ ఏపీని పాలిస్తున్న వ్యక్తులకు మోదీ అంటే భయం ఉంటుందేమో కానీ, పవన్ కల్యాణ్ కు మాత్రం భయంలేదు. మోదీ అంటే గౌరవం మాత్రమే ఉంది. నాకు స్వార్థంలేదు కాబట్టి నన్నెవరూ బెదిరించలేరు. నా చివరిశ్వాస వరకు ప్రజలకోసమే ఉంటాను. నేను ఇక్కడ ఉన్నది సినిమాలు చేయడానికి కాదు. ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం. పనిచేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు. ఫలితాలు, పదవి నావెంట పరిగెత్తుకుని రావాలి" అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
Top