ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతనంగా ముఖ్యమంత్రి అయినా వైసిపి అధినేత జగన్ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను ఉద్దేశించి ప్రధాని మోడీకి పరోక్షంగా ఒక గులాబీ పువ్వుతో చెప్పినట్లు అయ్యిందని ఇటీవల తిరుపతి పర్యటనలో జగన్ వ్యవహరించిన తీరుపై రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. జగన్ చాలా తెలివైన ముఖ్యమంత్రి అని కూడా పొగుడుతున్నారు. సాధారణంగా ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం పలికే క్రమంలో భారీ బొకేల.. పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వటం ఒక అలవాటుగా ఉండేది. అందుకు భిన్నంగా తాజాగా బొకేలను బంద్ చేసి సింగిల్ గులాబీని ముచ్చటగా చేతికి ఇచ్చిన వైనం కొత్తగా ఉండటమే కాదు.. అనవసర ఖర్చుకు ఎలా కళ్లెం వేస్తానన్న విషయాన్ని మోడీకి జగన్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ఏపీ లాంటి ఆర్థిక పరిస్థితి ఉన్న రాష్ట్రం ఎలా ఉండాలని మోడీ కోరుకుంటారో.. అదే తీరులో జగన్ తీరు ఉండటం ఆయన మనసును దోచేసేసుకోవటమే కాదు.. రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించే విషయంలో మరింత పాజిటివ్ గా ఉండేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయన్న వాదన వినిపిస్తోంది. తానొక్కరేకాదు.. మోడీకి స్వాగతం పలికేందుకు వచ్చిన వారంతా సింగిల్ గులాబీలతో వెల్ కం చెప్పిన తీరు సరికొత్తగా ఉందని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్లు చేస్తున్నారు.