కేబినెట్ భేటీలో మంత్రులకు ముందే వార్నింగ్ ఇచ్చిన జగన్..?

Written By Aravind Peesapati | Updated: June 11, 2019 17:28 IST
కేబినెట్ భేటీలో మంత్రులకు ముందే వార్నింగ్ ఇచ్చిన జగన్..?

కేబినెట్ భేటీలో మంత్రులకు ముందే వార్నింగ్ ఇచ్చిన జగన్..?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీత రహిత రాష్ట్రంగా చేస్తానని గతంలోనే వైసీపీ అధినేత జగన్ చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చాక జగన్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్ భేటీలో ఎక్కడా కూడా రాష్ట్రంలో అవినీతి జరగకుండా చూడాలని జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని ఏపీ సీఎం జగన్ మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎపిలో మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే తొలగించడం జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశం తర్వాత ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నేని వెల్లడించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ మానిపెస్టోలని అనేక అంశాలను అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. మంత్రులు ఎవరూ అవినీతి కి ఆస్కారం ఇవ్వవద్దని, మన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రాకూడదని జగన్ స్పష్టం చేశారని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటెరిమ్ రిలీప్ 27 శాతం, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపు, ఉచితంగా బోర్లు, సిపిఎస్ రద్దు, రైతులకు వడ్డీ లేని రుణాలు, రైతులకు వైఎస్ ఆర్ భరోసా కింద 12500 కోట్ల రూపాయలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని ఆయన అన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం పద్దెనిమిదివేలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అమ్మ ఒడి కింద పదిహేను వేల రూపాయల చొప్పున పిల్లల తల్లిదండ్రులకు ఇవ్వాలని కూడా నిర్ణయించామని ఆయన చెప్పారు.
Top